![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1019 లో.. రాజీవ్ కాలేజీలో వసుధార, మనుల పోస్టర్లు అంటించడంతో వాడిని మహేంద్ర, అనుపమ చూసి షాక్ అవుతారు. ఇక మను, వసుధార ఇద్దరు రాగానే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అంటు శైలంద్ర సైగ చేయగానే ఫాకల్టీ రెచ్చిపోయి మాట్లాడతారు. ఎవరు ఇదంతా చేశారని అనుపమ అడుగుతుంది. నాకేం తెలియదని మను అంటాడు.
ఆ తర్వాత రిషి సర్ పై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఇలా చేస్తారా అని ఫాకల్టీ అంత కలిసి వసుధారని అంటారు. మీరు ఒక ఎండీ పదవి లో ఉండి ఇలా చేస్తారని ఊహించలేదని కొందరు అంటారు. అసలు ఇదంతా మను గారే చేశారని ఫాకల్టీ అంటూ ఉంటే వసుధార కోపంగా మను దగ్గరికి వెళ్లి ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అని మనుని కొడుతుంది. దాంతో అనుపమ బాధపడుతుంది. మీరు అసలు ఎండీ పదవి అర్హులు కాదు.. ఈ కాలేజీ పరువు ప్రతిష్టలు ఏం అవుతాయని అందరు అంటారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.. దీన్ని కావాలనే ఎవరు చేస్తున్నారని మహేంద్ర అంటాడు. నేను ఇక ఎండీ పదవిలో ఉండను ఇంత అవమానం జరిగిన చోట అసలు ఉండను అంటు వసుధార వెళ్ళిపోతుంది. నీ సంగతి చెప్తానంటు శైలేంద్రకి మను వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత ఎండీగా శైలేంద్ర గారు కరెక్ట్ అని బోర్డు మెంబర్స్ అందరు అంటారు. దాంతో ఎండీ పదవిలో శైలేంద్ర కూర్చోడానికి రెడీ అవుతాడు. పంతులు గారు ఎండీ చైర్ కి పూజ చేసి ఇక కూర్చోండి అని శైలంద్రకి చెప్పగానే.. నేను సాధించాను సాధించాను అంటూ గట్టిగా అరుస్తాడు. తీరా చూస్తే కార్ లో కాలేజీకి శైలేంద్ర, ధరణి వెళ్తుంటారు. శైలేంద్ర ఇదంతా ఉహించుకుంటాడు. మీరేం సాధించారంటు ధరణి అంటుంది. ఇక శైలేంద్ర ఓవర్ థింకింగ్ తో.. పూజారికి ఫోన్ చేసి కాలేజీకి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత అందరు కాలేజీలో పోస్టర్లు చూస్తుంటారు. అప్పుడే వసుధార వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |